2024-12-20 07:01:09.0
సభా నాయకుడైన సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సభాపతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హామీ
శాసనసభలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ జరగడానికి, భూ భారతి బిల్లు చర్చ సహకరించాలని స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరారు. బిల్లుపై చర్చ అనంతరం అన్ని అంశాలపై బీఆర్ఎస్ తో మాట్లాడుతానని స్పీకర్ చెప్పారు. సభను వాయిదా వేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో స్పీకర్ మావేశమయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. సభాాపతికి, మంత్రికి ఒకే అంశమైన ఫార్ములా ఈ- రేస్ చర్చకు అనుమతివ్వాలని కోరారు. అజెండాలోని అంశం భూ భారతి బిల్లుపై చర్చ కొనసాగుతున్నదన్నారు. దానికి సహకరించాలని కోరారు. అయితే తాము చర్చకు సహకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఫార్ములా ఈ- రేస్ చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీనిపై తాము స్పీకర్ కు లేఖ ఇచ్చామని, కేటీ ఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్ములా ఈ- రేస్ చర్చ ఎప్పుడు చేపడుతారో సభాపతి సభలో ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. దీనిపై తాము మాట్లాడుకుంటామని చర్చ తర్వాత సభా నాయకుడైన సీఎంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానని సభాపతి హామీ ఇచ్చారు.
BRS seeks debate,On Formula-E issue,Telangana Assembly,Speaker Gaddam Prasad Kumar,Assurance,BRS MLA’s,KTR