2024-12-14 12:06:29.0
“నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని.. ఈ ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాది” అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
నా రాజకీయ ఎదుగుదలో మాదిగ సామాజిక వర్గం పాత్ర గణనీయంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ మాదాపూర్ లోని దస్పల్ల హోటల్లో జరిగిన గ్లోబల్ మాదిగ డే -2024 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మాదిగలకు అన్యాయం జరగనివ్వదని.. న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు.. కానీ మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకరుంటామని ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీరణ రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు.
వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి క్రియాశీల పాత్ర పోషించిందన్నారు. వర్గీకనణపై న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించామన్నారు. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతను నియమించుకున్నామని వందేళ్ల ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించామని చెప్పారు. ఐఐటీ వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామన్నారు. పగిడి పాటి దేవయ్యను స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించుకున్నామని అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.
CM Revanth Reddy,Global Madiga Day -2024,Minister Damodara Rajanarsimha,SC classification,Supreme Court,Manda krishana madiga,OU VC,Pagidi Pati Devaiya