సివిల్స్ మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం అభినందనలు

2024-12-11 15:23:53.0

యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది రాజీవ్ సివిల్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 20 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సింగరేణి సహకారంతో ప్రభుత్వ ఆర్థిక సాయం అందుకొని యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక చిరు దీపం కొండంత వెలుగును ఇస్తుందని, ప్రభుత్వ చిరు సాయం గొప్ప ఫలితాలను అందించిందని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులై మెయిన్స్ కు అర్హత సాధించిన వారిలో అర్హులైన 135 మందికి గత ఆగస్టులో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తదుపరి దశల్లోనూ అభ్యర్థులు రాణించాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్ సాధించేలా తదుపరి దశల్లోనూ అభ్యర్థులు రాణించాలని కోరుతూ ముఖ్యమంత్రి శుభాభినందనలు తెలిపారు

CM Revanth Reddy,Civil Mains,UPSC,Rajiv Civils Abhaya Hastam,Telangana,Mains Results,Telangana Goverment,CS Shanthi kumari,Deputy cm Mallu Bhatti Vikramarka