2024-12-11 10:45:22.0
ముఖ్యమంత్రి రేవంత్ చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ తల్లి రూపం మార్చి, బతుకమ్మను తొలగించడం తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, మరియు ఆత్మగౌరవానికి చెరగని మచ్చ. సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ఆయన ప్రకటించారు. సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు మీరు చూపిన నిబద్ధతకు నా హృదయపూర్వక అభినందనలు. ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో మీ మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Nandini Sidhareddy,KTR,CM Revanth Reddy,Mother form of Telangana,History,culture,KCR,BRS Party,Telangana goverment