2025-02-02 11:20:40.0
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కారును జనసేన కార్యకర్త ధ్వంసం చేశాడు
https://www.teluguglobal.com/h-upload/2025/02/02/1399653-mudharagada.webp
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కారును ధ్వంసం చేసిన జనసేన కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన పార్టీకి చెందిన గనిశెట్టి గంగాధర్ తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్‌తో వచ్చిన హల్చల్ చేసిన విషయం తెలిసిందే.జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఇంటి ముందు పార్క్ చేసిన ముద్రగడ్డ కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టి గంగాధర్ ధ్వంసం చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు నిందితుడు గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన పై తాజాగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ముద్రగడ కారుపై దాడి ఘటనపై స్పందించారు. జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పు అని తేల్చి చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు