రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

2025-01-25 05:31:23.0

రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖ సమర్పించిన వైసీపీ ఎంపీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/25/1397571-vijayasai-reddy.webp

వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం విజయసాయిరెడ్డి ‘ఎక్స్‌’ వేదిగా ప్రకటించిన విషయం విదితమే. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లూ లేవని చెప్పారు.