2024-12-20 04:51:03.0
కొండపై ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరిక
https://www.teluguglobal.com/h-upload/2024/12/20/1387487-ttd.webp
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదని మా పాలకమండలి మొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.