2024-12-03 06:48:57.0
కీలక పాలసీలకు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం
https://www.teluguglobal.com/h-upload/2024/12/03/1382908-ap-cm.webp
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. ఐటీ, టెక్స్టైల్ పాలసీలకు ఆమోదం లభించనున్నది. మారిటైమ్, పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీల సవరణలను ఆమోదించే అవకాశం ఉన్నది. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశంపైనా కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.