శ్రీవారికి ఆదికేశవుల నాయుడు మనవరాలు భారీ విరాళం

2024-11-14 07:16:00.0

దాదాపు రూ. 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాల అందజేత

https://www.teluguglobal.com/h-upload/2024/11/14/1377647-ttd.webp

శ్రీవారికి టీటీడీ మాజీ ఛైర్మన్‌, దివంగత డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీడీపీ ఛైర్మన్‌ బీఆర్‌నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్నిఉత్సవమూర్తులకు టీడీపీ అలంకరించనున్నది. శుక్రవారం తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీమాలను తేజస్వీ విరాళంగా అందజేయనున్నారు.

లిక్కర్‌ వ్యాపారి, పారిశ్రామికవేత్త దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక జనసేనలో చేరారు. ఆమె చేరికతో రాయలసీమ ప్రాంతంలో ఆ పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు. డీకే చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా, టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.