2024-11-10 16:17:07.0
టీటీడీ తొలి పాలక మండలి సమావేశం ఈ నెల 18న నిర్వహిస్తామని తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376614-ttd.webp
టీటీడీ తొలి పాలక మండలి సమావేశం ఈ నెల 18న నిర్ణయింస్తామని తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.నవంబర్ 18న ఉదయం 10:15 గంటలకు తిరుమల అన్నమయ్య భవనం లో పాలక మండలి సభ్యులతో తొలి సమావేశం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాక తొలి బోర్డు సమావేశం జరగబోతున్నదని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీహయాంలోని టీటీడీ బోర్డు చైర్మన్ సహా సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలక మండలి సభ్యులను నియమించింది. టీటీడీ బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.