ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు

2024-11-10 10:36:52.0

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376544-subba-rao.webp

వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావుకు సముచిత గౌరవం లభించింది. ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి ఆయన పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖను ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి ఆయన పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయించింది.