టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

2024-11-07 07:43:29.0

ప్రమాణం చేసిన భానుప్రకాశ్‌ రెడ్డి, ముని కోటేశ్వర్‌ రావు, సుచిత్ర ఎల్లా

https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375575-ttd-board-members.webp

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి ట్రస్ట్‌ బోర్డు సభ్యులు భానుప్రకాశ్‌ రెడ్డి, ముని కోటేశ్వర్‌ రావు, సుచిత్ర ఎల్లాతో ప్రమాణం చేయించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచం చేసి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.