2024-10-19 15:21:24.0
జనసేన పార్టీలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నేడు జనసేన పార్టీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
https://www.teluguglobal.com/h-upload/2024/10/19/1370644-janasena.webp
జనసేన పార్టీలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నేడు జనసేన పార్టీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. క్రాంతి భర్త కూడా పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు గుంటూరు కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు, కొందరు జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. పెడన నియోజకవర్గం నుంచి ఓ ఎంపీటీసీ, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచిలు కూడా పార్టీలోకి వచ్చారు.
వీరందరికీ పవన్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి బాహాటంగా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. అటు, పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానన్న ముద్రగడ.. ఎన్నికల్లో పవన్ గెలవడంతో నిజంగానే తన పేరు మార్చుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్టు గెజిట్ కూడా రిలీజ్ చేశారు.