తిరుపతిలో భారీ వర్షాలు.. ఆ రోజు శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

2024-10-14 16:01:09.0

Heavy rains in Tirupati.. Srivari VIP break darshans canceled that day

https://www.teluguglobal.com/h-upload/2024/10/14/1368910-vip.webp

తిరుపతిలో భారీ వర్షాలు నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 16న శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సోమవారం బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నది. తుఫాన్ భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం ఎలాంటి సిఫారసలు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.

విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. 48 గంటల్లో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టెర్లు తెలిపారు.