రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం

2024-10-10 07:13:33.0

అజెండాపై చర్చ వాయిదా..ముంబయికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

https://www.teluguglobal.com/h-upload/2024/10/10/1367847-cm-babu.webp

ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్‌ వాయిదా వేసింది. రతన్‌ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. భేటీకి ముందు ఆయన చిత్రపటం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళి అర్పించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ముంబయికి బయలుదేరనున్నారు. రతన్‌ టాటా పార్థివ దేహానికి వారు నివాళులు అర్పించనున్నారు. రతన్‌ టాటా పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభకానున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నది.