2024-10-01 12:07:58.0
ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు
https://www.teluguglobal.com/h-upload/2024/10/01/1365050-pavan.webp
ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు నిర్వహించి కాలినడకన శ్రీవారి కొండకు బయలుదేరారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
డిప్యూటీ సీఎం రాకతో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుపతి ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆక్టోబర్ 3న తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి పవన్ విజయవాడకి తిరిగి పయనవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పవన్ పిలుపుతో సెప్టెంబర్ 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు.