కేజ్రీవాల్‌ కు షాక్‌ ఇచ్చిన న్యూ ఢిల్లీ ప్రజలు

2025-02-08 07:34:01.0

మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో పర్వేష్‌ వర్మ చేతిలో పరాజయం

https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401538-kejriwal.webp

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేషనల్‌ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కు న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు భారీ షాక్‌ ఇచ్చారు. శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభించిన నాటి నుంచి న్యూఢిల్లీలో అర్వింద్‌ కేజ్రీవాల్‌, పర్వేష్‌ వర్మ మధ్య దోబూచులాడిన విజయం చివరికి పర్వేష్‌ వర్మనే వరించింది. మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ చేతిలో మాజీ సీఎం కేజ్రీవాల్‌ మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కేజ్రీవాల్‌ పై విజయం సాధించిన పర్వేష్‌ వర్మ ఢిల్లీ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు.

Delhi Assembly Elections,Arvind Kejriwal,Parvesh Varma,New Delhi