2025-02-05 12:29:50.0
కాసేపట్లో ముగియనున్న పోలింగ్.. 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
https://www.teluguglobal.com/h-upload/2025/02/05/1400615-delhi-elections.webp
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశమిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాతే ఎంతశాతం ఓటింగ్ నమోదు అయ్యిందనే వివరాలపై క్లారిటీ రానుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6.30 గంటల తర్వాతే వెల్లడించాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈనెల 8న వెల్లడికానుంది.
Delhi Assembly Elections,57.70 % Poling up to 5pm,Exit Polls After 6.30pm,AAP vs BJP,Congress,Arvind Kejriwal,Narendra Modi,Rahul Gandhi