మహాకుంభమేళా: 30 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు

2025-01-31 09:23:54.0

ఇవాళ ఉదయం 8 గంటల వరకే మరో 43 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ సర్కార్‌ వెల్లడి

https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399153-maha-kumbhamela.webp

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటివరకు పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 30 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కుంభమేళా మొదలైన ఈ నెల 13 నుంచి 31వ తేదీవరకు 30 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని పేర్కొన్నది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే మరో 43 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు వెల్లడించింది. ఘాట్ల వద్ద పరిస్థితికి సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలను యోగి ప్రభుత్వం విడుదల చేసింది.

Maha Kumbh,More than 30 crore,Devotees,Take dip in Sangam,Maha Kumbh festival,Prayagraj