ప్రయాగ్‌రాజ్‌ తొక్కిసలాటలో 30 మంది మృతి : డీఐజీ

2025-01-29 13:53:19.0

ప్రయాగ్‌రాజ్‌ జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు.

https://www.teluguglobal.com/h-upload/2025/01/29/1398632-thukilata.webp

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే తొక్కిసలాట జరిగిందని మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. ఈఘటనలో 30 మంది మృతి చెందారని మరో 60 మందికి పైగా గాయపడినట్లు డీఐజీ తెలిపారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకట్రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు.

ఇవాళ మహా కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని వెల్లడించారు. వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1920ను సంప్రదించాలని డీఐజీ సూచించారు.

UP,Prayagraj,Mahakumbh DIG Vaibhavkrishna,Mahakumbh Mela,PM MODI,CM YOGI,Rahul gandhi,UP Goverment