2025-01-20 11:13:45.0
కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసు తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
https://www.teluguglobal.com/h-upload/2025/01/20/1396100-mamatha-benhrhee.webp
కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసు తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరం నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశామని. కానీ కోర్టు జీవిదు ఖైదు విధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని ఆయన అన్నారు. ఒకవేళ కోల్కతా పోలీసుల చేతుల్లోనే ఉంటే వారు దోషికి మరణశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని అన్నారు.
ఇదిలా ఉండగా.. సీల్దా కోర్టు తీర్పుపై కోల్కతా విద్యార్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగ సీల్దా కోర్టు ఎదుట విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్టూడెంట్స్ సంచలన ప్రకటన చేశారు. కాగా, కోర్టు తీర్పులో దోషికి జీవితఖైదు విధించడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
CM Mamata Banerjee,Kolkata Trainee Doctor Murder,Sealda Court Verdict,RG Kar Incident,Sanjay Roy,Life Prisonment,Court Kolkata,CBI,PM MODI,Kolkata Police