2025-01-18 13:52:35.0
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు.
https://www.teluguglobal.com/h-upload/2025/01/18/1395719-vdvsdvd.webp
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడ్డా నిందితుడిని ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఛత్తీస్ గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడి కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. దాదాపు 20 బృందాలుగా ఏర్పడిన పోలీసులు వివిధ ప్రాంతాలను జల్లెడపట్టారు. చివరికి నిందితుడిని ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో అదుపులోకి తీసుకున్నారు. ముంబయి పోలీసులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ రైల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు ఆకాశ్ అని గుర్తించారు. నిందితుడి కోసం ముంబయి పోలీసులు ఛత్తీస్ గఢ్ బయల్దేరారు.
Saif Ali Khan,Chhattisgarh,Jnaneshwari Express train,Durg,Crime news,Mumbai Police