2024-12-18 14:05:24.0
రాజ్యసభలోతాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా ఆగ్రహం
https://www.teluguglobal.com/h-upload/2024/12/18/1387087-sha.webp
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌కు వ్యతిరేకమని, రాజ్యసభలో నిన్న తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశంలో అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నదని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించదంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు మండిపడుతున్న వేళ ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. అంబేద్కర్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని.. పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిన తీరును ఖండిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు.
కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏనాడూ అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆయనను ఎంతో గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించిందని మండిపడ్డారు. నేను ఎన్నడూ అంబేద్కర్‌ను అవమానించని పార్టీ నుంచి వచ్చాను. ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్న నా ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉన్నది. కలలో కూడా అంబేద్కర్ ఆలోచనలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చానని తెలిపారు. రాజ్యసభలో నా పూర్తి ప్రసంగాన్ని ప్రజలకు మీడియా చూపించాలని కోరారు. నేను రాజీనామా చేస్తే ఖర్గే జీ సంతోషపడుతారంటే.. అలాగే చేస్తాను. కానీ మరో 15 ఏళ్లు వారు ప్రతిపక్షంలోనే ఉండాలి. నా రాజీనామా దాన్ని మార్చలేదని అమిత్ షా అన్నారు.
Congress anti-Ambedkar,anti-reservation,Distorts facts,Amit Shah attacked,Congress over the Emergency