ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్‌ చేసేందుకు యత్నించింది

2024-12-13 08:04:51.0

రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కొందరి పాత్ర విస్మరణకు గురైందన్న రాజ్‌నాథ్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385489-rajnath.webp

రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన కొంతమంది ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తరఫున లోక్‌సభలో ఈ చర్చను రాజ్‌నాథ్‌ ప్రారంభించారు.

రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కొందరి పాత్ర విస్మరణకు గురైంది. స్వాతంత్య్ర ఉద్యమ పోరాటస్ఫూర్తి నుంచి ఈ రాజ్యాంగం ఉద్భవించింది అని మంత్రి వెల్లడించారు. అప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటైన కమిటీలో భాగం కాకపోయినా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారంటూ మదన్‌ మోహన్‌ మాలవీయ, లాలా లజ్‌పత్‌ రాయ్‌, భగత్‌సింగ్‌, వీర్‌ సావర్కర్‌ వంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్‌ చేసేందుకు యత్నించిందని కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ ప్రకటనతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మంత్రి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం వరకు కొనసాగే ఈ చర్చకు ముగింపు ప్రధాని మోడీ సమాధానం ఇస్తారు. 

A particular party,Always attempted,Hijack Constitution,Making work,Rajnath Singh,Slamming Congress,In Parliament