2024-12-03 10:47:11.0
జూపిటర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
https://www.teluguglobal.com/h-upload/2024/12/03/1383009-eknath-shinde.webp
మహారాష్ట్ర కేర్‌టేకర్ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం మధ్యాహ్నం ముంబయిలోని తన అధికారిక నివాసం ‘వర్షా’కు చేరుకున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఉదయం థానేలోని జూపిటర్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆయన డాక్టర్లు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెడికేషన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. మహారాష్ట్రలో పదవుల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అధినాయకత్వం పట్టుబడుతోంది. ఈనేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖల కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. గురువారం (ఈనెల 5న) మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలోనే షిండే ముంబయికి తిరిగి వచ్చారు.
Eknath Shinde,Maharashtra,Caretaker CM,Varsha,Official Residence,Mahayuti,Devendra Fadnavis