మహారాష్ట్ర మాజీ సీఎంతో కోమటిరెడ్డి భేటీ

2024-11-15 14:20:46.0

అసెంబ్లీ ఎన్నికల సరళి, తెలంగాణ ప్రభుత్వంపై ఇద్దరి మధ్య చర్చ

https://www.teluguglobal.com/h-upload/2024/11/15/1378156-komatireddy-met-with-shinde.webp

మాజీ గవర్నర్‌, మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. షోలాపూర్‌ లో ఎంపీ ప్రణతి షిండేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కోమటిరెడ్డి సుశీల్‌ కుమార్‌ షిండేను మర్యాద పూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన అనుభవాలు, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన చేనేత, యాదవ, కురుమ కులాల వాళ్లు పెద్ద సంఖ్యలో షోలాపూర్‌ లో స్థిరపడ్డారని కోమటిరెడ్డి వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ కూటమి ఘన విజయం సాధిస్తుందని షిండే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

Maharashtra,Assembly Elections,Former CM Shushil Kumar Shinde,Komatireddy Venkat Reddy