2024-11-11 04:04:12.0
జస్టిస్ ఖన్నాతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
https://www.teluguglobal.com/h-upload/2024/11/11/1376659-justice-sanjiv-khanna.webp
సుప్రీంకోర్టు 51 ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జస్టిస్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది మే వరకు జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు సీజేగా కొనసాగనున్నారు.
1960 మే 14న న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ వర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా నమోదు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. టాక్సేషన్, ఆర్బిటేషన్, కమర్షియల్, కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్ 25న ఢిల్లీ హైకోర్టు అడిషన్ న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 నుంచి జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఖన్నా ఆరేళ్ల కాలంలో 117తీర్పులు రాశారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తీరర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు.
Justice Sanjiv Khanna,Takes oath,As CJI today,President Droupadi Murmu,Will administer