2024-11-07 09:19:27.0
ఫిర్యాదుదారుడు, నిందితుడికి మధ్య రాజీ కుదిరిందని కేసు కొట్టేయడమేంటని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం
https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375619-sc.webp
లైంగిక వేధింపుల కేసు విషయంలో గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుదారుడు, నిందితుడికి మధ్య రాజీ కుదిరిందని కేసు కొట్టేయడమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
రాజస్థాన్‌లోని గంగాపూర్ ప్రాంతంలో 2022లో ఈ లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ తనపై లైగింక వేధింపులకు పాల్పడ్డాడని ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మైనర్ బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ తర్వాత కుటుంబ నుంచి భిన్నమైన వాంగ్మూలం వచ్చింది. అపార్థంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆ టీచర్‌పై ఎలాంటి చర్యలు వద్దని తెలిపింది. దీనికి అనుగుణంగా కింది కోర్టులో పోలీసులు నివేదిక సమర్పించారు. అయితే దాన్ని కోర్టు తిరస్కరించడంతో నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసింది. కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది.
Sexual Harassment Cases,Cannot Be Quashed,On Grounds Of Compromise,Supreme Court