రేపే ప్రియాంక నామినేషన్.. మైసూరులో సోనియాకు స్వాగతం

2024-10-22 15:51:04.0

కేరళలో వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు

https://www.teluguglobal.com/h-upload/2024/10/22/1371563-priyaka.webp

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఐఎన్‌సి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కర్ణాటక మైసూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వారికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కేరళలో వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక కంటే మెరుగైన ప్రజా ప్రతినిధిని ఊహించలేను. ఆమె వయనాడ్ ప్రజల తరఫున లోక్ సభలో గళమెత్తుతారని నాకు నమ్మకం ఉంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వయనాడ్ వెళ్లారు.

Sonia Gandhi,Priyanka Gandhi,Wayanad,Rahul Gandhi,CM Siddaramaiah,Deputy CM DK