2024-10-16 11:54:29.0
మహారాష్ట్ర మజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు యూట్యూబ్ వీడియోలను చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు తెలిపారు
https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369632-baba.webp
మహారాష్ట్ర మజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు యూట్యూబ్ వీడియోలను చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని, బుల్లెట్ మ్యాగజైన్ లేకుండా గన్ షూటింగ్ సాధన చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న షూటర్లు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్మప్లు అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఖాళీ స్థలం లేని నిందితులు దాదాపు నాలుగు వారాల పాటూ ఈ వీడియోలను చూస్తూ లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం ఎలాగో నేర్చుకున్నట్లు ఓ అధికారిని ఊటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది.
సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఈ కేసులో శివకుమార్ గౌతమ్ మెయిన్ షూటర్‌గా ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఇక ఎంక్వరీలో నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా ఉపయోగించినట్లు వెల్లడైంది. ఎవరికీ అనుమానం రాకుండా కమ్మూనికేషన్ కోసం స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకున్నట్లు తేలింది. మర్డర్‌కు 25 రోజుల ముందు వరుకు సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా వేసినట్లు సదరు అధికారిని ఊటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.
Former minister Baba Siddiqui’,NCP leader,Mumbai Police,Gurmail Singh,Dharmaraj Kashmup,Siddiqui’s Lawrence Bishnoi Gang,Sivakumar Gautham