వయనాడ్ బరిలోకి ప్రియాంక గాంధీ

2024-10-15 15:58:30.0

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వయానాడ్ స్థానానికి జరిగే ఊప ఎన్నికకు ప్రియాంక పోటీ చేయునున్నట్లు ఏఐసీసీ తెలిపింది.

https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1369304-priyaka.avif

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వయానాడ్ స్థానానికి జరిగే ఊప ఎన్నికకు ప్రియాంక పోటీ చేయునున్నట్లు ఏఐసీసీ తెలిపింది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా పోటీ రెండు చోట్లా విజయం సాధించారు. అయితే వయనాడ్‌ ఎంపీ సీటును రాహుల్ గాంధీ వదులుకున్నారు. అంతా ఊహించినట్లే వయనాడు లోక్ సభ ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలిచారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించింది. నవంబర్‌ 13న ఉప ఎన్నిక జరుగనుంది. 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. 

Priyanka Gandhi,Wayanad,Rahul Gandhi,AICC,Lok Sabha by-election,Rae Bareli,Sonia gandhi