2024-10-15 12:38:12.0
కో ఇన్ చార్జీగా అతుల్ గార్గ్.. నియమించిన పార్టీ హైకమాండ్
https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1369215-baijayath-panda.webp
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ, కో ఇన్ చార్జీలను నియమించింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీని తిరుగులేని ఆదిక్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈనేపథ్యంలో రాబోయే ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఇన్ చార్జీలను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బైజయత్ పండాను ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జీగా నియమించారు. పార్లమెంట్ సభ్యుడు అతుల్ గార్గ్ ను కో ఇన్ చార్జీగా నియమించారు.
Delhi Assembly Elections,BJP,Bai jayath panda,Atul garg,JP Nadda,Narendra Modi,Amith Shah