చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో మరో 2 డిజైన్లు

2024-08-21 04:11:07.0

శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మరోవైపు చంద్రయాన్‌-4 మిషన్‌ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్టు ఇస్రో ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

https://www.teluguglobal.com/h-upload/2024/08/21/1353572-chandrayaan-4-and-5-design-complete-70-satellites-likely-to-be-launched-in-5-years-isro-chief.webp

చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్న ఇస్రో మరో రెండు డిజైన్లు కూడా పూర్తిచేసినట్టు ఆ సంస్థ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్‌-3 పూర్తయిందని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు చంద్రయాన్‌-4, చంద్రయాన్‌-5 పేరుతో డిజైన్లు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం అవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని తెలిపారు.

మానవ రహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరులో చేపట్టే అవకాశం ఉందని సోమనాథ్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల రాకెట్లు శ్రీహరికోటకు ఇప్పటికే చేరుకున్నాయని చెప్పారు. శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మరోవైపు చంద్రయాన్‌-4 మిషన్‌ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్టు ఇస్రో ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

Chandrayaan 4,Chandrayaan 5,Design,Complete,70 satellites,launched,5 years,ISRO chief