ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత సాక్షిగా కాష్‌ ప్రమాణం

2025-02-22 04:00:32.0

భారత మూలాలు ఉన్న కాష్‌ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అయితే భారత మూలాలు ఉన్న కాష్‌ భగవద్గీతపై ప్రమాణం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి కాష్‌ పటేల్‌ గర్లఫ్రెండ్‌ అలెక్సీస్‌ విల్‌కిన్స్‌, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. విల్‌కిన్స్‌ భగవద్గీత పట్టుకోగా.. దానిపై చేయి ఉంచి ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కాస్‌ మాట్లాడుతూ.. ఇకపై ఎఫ్‌బీఐ లోపల, వెలుపల జవాబుదారీతనం ఉంటుందని హామీ ఇచ్చారు. 

Kash Patel,Sworn in as 9th FBI director,Takes oath,On Bhagavad Gita