2025-02-10 01:44:24.0
హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నదన్న అమెరికా అధ్యక్షుడు
గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. మా ఆధ్వర్యంలో దానిని పునర్ నిర్మించే బాధ్యతలను ఇతరులకు అప్పగించవచ్చు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Trump reiterates,US will take over Gaza,Redevelopment plan,Middle East states