షేక్ హసీనా వీసా గడువును పొడిగించిన భారత్

2025-01-08 12:14:02.0

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది. గత ఆగస్ట్ నుంచి భారత్‌లోనే తలదాచుకుంటున్నారు. గడువు పెంపుతో ఆమె మరి కొంత కాలం ఇక్కడే ఉండేందుకు వీలవుతుంది. భారత్ ఆశ్రయంలో ఉన్నా హసీనాను తమకు అప్పగించాలని బంగ్లా ఆపద్ధర్మ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీసా పొడిగింపు ఆమెకు ఊరటనిచ్చింది. బంగ్లాలో జూలైలో జరిగిన హత్యలు, అదృశ్యాలకు మాజీ ప్రధాని షేక్ హసీనా, మరో 96 మంది కారణమని బంగ్లా ప్రభుత్వం అభియోగాలు మోపింది.

దీనిపై ఇప్పటికే బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర న్యాయస్థానం హసీనా అరెస్టుకు వారెంట్లు సైతం జారీ చేసింది. వారందరి పాస్ పోర్టులను ఇమ్మిగ్రేషన్, పాస్ పోర్టు విభాగాలు రద్దు చేశాయి. ఇదే సమయంలో భారత ప్రభుత్వం హసీనా వీసా గడువును పెంచడం ఆసక్తికరంగా మారింది. 

Bangladesh,Sheikh Hasina,Visa,Government of India,Immigration and Passport Departments,PM MODI