అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌

2024-12-24 17:00:09.0

దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసిన నాసా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర (ఐఎస్‌ఎస్‌)లో సునీతా విలియమ్స్‌, ఇతర వ్యోమగాములు క్రిస్మస్‌ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్టు చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు.. వ్యోగమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం విదితమే. వచ్చే ఏడాది మార్చి చివర్లలో లేదా ఏప్రిల్‌ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉన్నదని ఇటీవల నాసా వెల్లడించింది. 

Sunita Williams,Shares,Joyful Christmas Preparations From Space,NASA_Astronauts,Space Station