2024-12-07 12:53:51.0
ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది సహా 29 మంది పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాలోని అద్వాన్ ఆస్పత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది సహా 29 మంది పాలస్తీనా వాసులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న చాలామంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ దాడులతో సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సౌకర్యాలు లేక అలమటిస్తున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొన్నది. గాజాలోని ఆస్పత్రులలో వైద్య సామాగ్రి, మావన వనరుల కొరత అధికంగా ఉన్నదని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 44,600 మంది పాలస్తీనియన్లు మరణించారని.. అందులో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వైపు ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నా… దాడులు మాత్రం తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది.
29 Palestinians killed,Israeli attacks,On Gaza hospital,Kamal Adwan Hospital,Northern Gaza