బంగ్లాలో భారత టీవీ ఛానళ్లపై నిషేధించాలని పిటిషన్‌

2024-12-03 07:31:06.0

బంగ్లాదేశ్‌ హైకోర్టులో రిటి పిటిషన్‌ దాఖలు చేసిన సుప్రీంకోర్టు లాయర్‌

భారత టీవీ ఛానళ్లను నిషేధించాలని కోరుతూ బంగ్లాదేవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.భారత టీవీ ఛానళ్లు బంగ్లా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని పిటిషన్‌ దాఖలు చేసిన బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు న్యాయవాది ఆరోపించారు. దుష్ప్రచారం వల్ల ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని, బంగ్లాదేశ్‌ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై బంగ్లాదేశ్‌ హైకోర్టు వచ్చేవారం విచారణ జరపనున్నది. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించాలని పిటిషన్‌ దాఖలు చేయగా దాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. హిందువులను రక్షించాలని చేపట్టిన ఆందోళనలో ఇస్కాన్‌ ప్రతినిధి చిట్టగాంగ్‌లో చిన్మయి కృష్ణదాస్‌ జాతీయ జెండాను అవమానించారని ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు చేపట్టిన నిరసనల్లో ఓ న్యాయవాది మరణించడంతో ఇస్కాన్‌ ను నిషేధించాలన్న పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు చిన్మయ్‌ కృష్ణదాస్‌ కు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి బంగ్లాదేశ్‌లో లాయర్లు ముందుకు రావడం లేదు. 

Petition,Bangladesh high court,Seeking ban,On Indian TV channels,lawyer Ekhlas Uddin Bhuiyan