పుతిన్‌ యుద్ధం విఫలమైంది: జో బైడెన్‌

2024-09-25 04:05:47.0

ఉక్రెయిన్‌, పశ్చిమాసియాల్లో శాంతి సాధ్యమేనన్న అమెరికా అధ్యక్షుడు

ఉక్రెయిన్‌, పశ్చిమాసియాల్లో సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అక్కడ శాంతికి ఇంకా ఆస్కారం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభంతో పాటు సుడాన్‌లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నదన్నారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి 79వ సాధారణ సభలో అమెరికా అధ్యక్షుడిగా చివరి ప్రసంగంలో బైడెన్‌ మాట్లాడుతూ.. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు.

దుదుడుకు చర్యలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడుతామన్నారు. దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను అంతం చేస్తామన్నారు. ఉక్రెయిన్‌పై రష్‌యా దండయాత్ర ప్రారంభించినప్పుడు నాటో మిత్రదేశాలు, ఇతర భాగస్వాములు ఇలా 50కి పైగా దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. దీంతో పుతిన్‌ యుద్ధం విఫలమైంది. ఉక్రెయిన్‌ ఇప్పటికీ స్వేచ్ఛగా ఉన్నది. నాటోనూ బలహీనపరచడానికి పుతిన్‌ ప్రయత్నించారు. మరో రెండు (ఫిన్లాండ్‌, స్వీడన్‌) కొత్తగా వచ్చి చేరడంతో నాటో మరింత బలపడింది అన్నారు. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి నెలకొనేవరకు ఆ దేశానికి మా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Putin’s war failed Ukraine,Joe Biden