2024-09-22 10:56:34.0
ఇరాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజి కారణంగా భారీ పేలుడు సంభవించింది.
ఇరాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజి కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద సమయంలో 30 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడినట్లు సమాచారం.. ప్రమాద సమయంలో 70 మంది పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను వెలికి తీసేందుకు, గాయపడిన కార్మికులను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది.
శనివారం రాత్రి 9 గంటలకు మదంజూ కంపెనీ నిర్వహిస్తున్న బొగ్గు గనిలోని బీ, సీ బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ రిలీజ్ కావడంతో పేలుడు జరిగినట్లు సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ గవర్నర్ అలీ అక్బర్ రహీమి తెలిపారు. సుమారు 51 మంది కార్మికులు మరణించగా మరో 20 మంది గాయపడినట్లు మీడియాతో అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ఘటనపై స్పందించారు. బాధితులకు అవసరమైన సాయం తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇరాన్లో గనుల్లో భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2013లో 11 మంది, 2009లో 20 మంది గనుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక 2017లో జరిగిన పేలుడులో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
Iran,Huge explosion,30 people killed,Methane gas,Irans President Masoud Pezheshkian,Gas leakage