నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం….విమానంలో 72 మంది, అందులో 10 మంది భారతీయులు

2023-01-15 06:46:45.0

ఈ విమానంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణీకుల్లో 10 మంది భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రెస్క్యూ టీం ఇప్పటి వరకు 20 మృతదేహాలను బైటికి తీసినట్టు సమాచారం.

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మండు నుంచి పోఖ్రా వెళ్తున్న యతి ఎయిర్ లైన్స్ ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయ్యింది. ఆ వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.

ఈ విమానంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణీకుల్లో 10 మంది భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రెస్క్యూ టీం ఇప్పటి వరకు 20 మృతదేహాలను బైటికి తీసినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.   

Terrible plane crash,Nepal,72 people,10 Indians