చైనాతో 24 ఒప్పందాలు: మోడీ

2015-05-15 02:21:18.0

చైనా పర్యటన సుహృత్భావ వాతావరణంలో జరుగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో సమావేశమయ్యారు. ఆయనతో వీసా విధానం, సరిహద్దు వివాదం, భారత్‌లో పెట్టుబడులు తదితర అంశాలను చర్చించారు. దాదాపు 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా సమకూరే 24 ఒప్పందాలు చేసుకున్నారు. వీటికి సంబంధించిన అంగీకార పత్రాలపై భారత ప్రధాని నరేంద్రమోడి, చైనా ప్రధాని లీ కెషాంగ్‌లు సంతకాలు చేశారు. సరిహద్దులోని నదుల […]

చైనా పర్యటన సుహృత్భావ వాతావరణంలో జరుగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో సమావేశమయ్యారు. ఆయనతో వీసా విధానం, సరిహద్దు వివాదం, భారత్‌లో పెట్టుబడులు తదితర అంశాలను చర్చించారు. దాదాపు 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా సమకూరే 24 ఒప్పందాలు చేసుకున్నారు. వీటికి సంబంధించిన అంగీకార పత్రాలపై భారత ప్రధాని నరేంద్రమోడి, చైనా ప్రధాని లీ కెషాంగ్‌లు సంతకాలు చేశారు. సరిహద్దులోని నదుల అనుసంధానంపై కూడా చర్చలు జరిపామని ఆయన అన్నారు. తమ ఇద్దరి మధ్య సంప్రదింపులు మంచి వాతావరణంలో జరిగాయని మోడీ తెలిపారు.

10 bilian dalors,24 agreements,China,India