ఆ డైరెక్టర్ సినిమాల్లో నటించడం చాలా ఇష్టం : ప్రియమణి

 

2025-01-29 10:44:35.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/29/1398557-priyamaani.webp

దర్శకుడు మణిరత్నం అంటే తనకు చాలా ఇష్టం అని నటి ప్రియమణి తెలిపింది.

ప్రముఖ నటి ప్రియమణి, దర్శకుడు మణిరత్నంపై ప్రశంస జల్లులు కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆయన సినిమాలో నటించడమే లక్కీ అని తెలిపింది. ఆయన మూవీలో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదని చెప్పింది. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే… కమిట్ అయిన వేరే సినిమాలను కూడా వదులుకోవడానికి సిద్ధమని తెలిపింది. మణిరత్నం నుంచి ఫోన్ వస్తే నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపింది. హీరోయిన్లకు మణిరత్నం ఫేవరెట్ డైరెక్టర్ అని… వారిని తెరపై ఆయన చాలా అందంగా చూపిస్తారని చెప్పింది. దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరని పేర్కొన్నాది.ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి.

ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ 3వ సీజన్‌ను చూడడానికి నేను కూడా ఎదురుచూస్తున్నాని తెలిపింది.‘ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన ప్రియమణి.పెళ్లైన కొత్తలో సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత యమదొంగ, నవవసంతం, హరే రామ్,‘కింగ్, ‘గోలీమార్‘నారప్ప’ వంటి సినిమాల్లో ప్రియమణి నటించింది. 

 

Loves acting in that director’s movies : Priyamani,’Family Man 3,Evere Atagadu movie,Yamadonga movie,Navasantham