గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్పెషల్‌ షో రద్దు

 

2025-01-11 14:55:34.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393704-game.avif

గేమ్‌ ఛేంజర్‌ సినిమా మార్నింగ్ స్పెషల్ రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది.

తెలంగాణలో గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్పెషల్‌ షో రద్దు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్మనలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి.. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది.

భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. తొలిరోజు ఈ సినిమా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ పేర్కొన్నాది

 

Ram Charan,Game Changer Movie,Telangana Home Department,Srikanth,Anjali,Director Shankar,Dil raju,CM Revanth reddy,Chiranjeevi,minister komatireddy