అబ్బే.. నేనలా అనలేదు!

 

2025-01-08 11:16:00.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/08/1392654-raendra-prasad.webp

పుష్ప-2పై నా వ్యాఖ్యలు వక్రీకరించారు

పుష్ప -2 సినిమాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీనియర్‌ యాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. షష్టిపూర్తి ప్రెస్ మీట్‌లో గతంలో తాను చేసిన కామెంట్స్‌ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పుష్ప -2 సినిమాలో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో వక్రీకరించారని.. ఇటీవల తాను అల్లు అర్జున్‌ ను కలిసిన సమయంలో ఇదే విషయంపై మాట్లాడుకున్నామని చెప్పారు. ఆ పోస్టింగ్‌ లను చూసి నవ్వుకున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగిటివ్‌ గా చూడొద్దని.. మనం చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలే వెండితెరపై ప్రతిబింబిస్తూ ఉంటాయన్నారు. లేడీస్‌ టైలర్‌, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ అని చెప్పారు.

 

Pushpa -2,Characterization of Hero,Rajendra Prasad,Comments,Allu Arjun,Shashti Purthi