2025-01-02 15:16:23.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/02/1391125-puspa-2-cullections.webp
నాలుగు వారాల్లో రూ.1,788 కోట్లు రాబట్టిన అల్లూ అర్జున్ మూవీ
రూ.2 వేల కోట్ల క్లబ్ వైపు పుష్ప -2 మూవీ వేగంగా దూసుకుపోతుంది. ఇండియన్ బాక్సీఫీస్ వద్ద అల్లూ అర్జున్, సుకుమార్, రష్మిక మంథన మూవీ పుష్ప -2 హవా కంటిన్యూ అవుతోంది. నాలుగు వారాల్లో ఇండియన్ మార్కెట్‌లో తమ సినిమా రూ.1,799 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టిందని పేర్కొంటూ గురువారం సినిమా యూనిట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. సినిమా హిందీ వర్షన్ ఒక్కటే రూ.వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది. సంక్రాంతి సినిమాల రిలీజ్ కు మరికొన్ని రోజులు ఉండటంతో అప్పటి వరకు థియేటర్లలో పుష్ప -2 హవా కొనసాగనుంది. దీంతో సినిమా ఐదో వారానికి కలెక్షన్లలో రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకుంటుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.
Pushpa-2,Fourth Week,Record Collections,Rs.1799 Crore,Movie Run to Rs.2000 Crore Club,Allu Arjun,Sukumar