2025-01-02 13:39:44.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/02/1391094-charan.webp
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో , శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. రామ్ చరణ్ డబుల్ రోల్ లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా లో రాజకీయం, యాక్షన్ సీన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ట్రైలర్లో రామ్ చరణ్ చివరలో హెలికాప్టర్లో నుంచి కత్తి పట్టుకుని దిగే షాట్ హైలెట్‌గా నిలిచింది. ఈ స్టిల్‌ను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం పై దిల్ రాజు నిర్మించారు. అంజలి, కియారా అద్వానీ, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, విశ్వంత్ పలువురు స్టార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా పై భారీ అంచనాలు పెంచారు మూవీ మేకర్స్.lఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. గేమ్ చేంజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో నిర్వహించారు. సంధ్య థియేటర్ అల్లు అర్జున్ ఘటన నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్ చేయకుండా కేవలం మీడియా ఆధ్వర్యంలోనే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు
‘Game Changer’ Movie,Mega power star Ram Charan,Director shankar,Anjali,Kiara Advani,SJ Surya,Naveen Chandra,Srikanth,Viswanth,AMB Multiplex,Mega fans,Chiramjeevi,Pavan kalayn