వైభవంగా నాగచైతన్య-శోభిత వివాహం.. ఫొటోలు వైరల్

 

2024-12-04 16:17:12.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/04/1383338-vav.webp

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల జంట ఒక్కటయ్యారు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లి ఘనం జరిగింది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ఎన్‌ఆర్ విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు.ఈ వివాహ వేడుకలో వధూవరులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జంట రేపు లేదా ఎల్లుండి శ్రీశైలం, తిరుమలకు వెళ్లనున్నారు. పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ముఖ్యంగా నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, అడవి శేష్ కూడా హాజరయ్యారు. వివాహ వేడుకకు టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, నటి సుహాసిని, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరో అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ తదితరులు హాజరయ్యారు.

 

Naga Chaitanya,-Shobhita,marriage,Annapurna Studios,Megastar Chiranjeevi,Mahesh Babu couple and Ram Charan coupleSrisailam,Tirumala,anr,Nagarjuna Akkineni