కన్నడ హీరో ఇంట తీవ్ర విషాదం

 

2024-10-20 08:47:14.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/20/1370760-sudeep.webp

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్‌ ఇవాళ ఉదయం అనారోగ్యంతో మరణించారు.

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజా సంజీవ్‌ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. సుదీప్‌ తల్లి మరణవార్త తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

సుదీప్‌ అమ్మ మరణవార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన సంతాపాన్నితెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సుదీప్‌ మాతృమూర్తి కన్నుమూశారని తెలిసి చింతించాను.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని సుదీప్‌ ఎన్నోసార్లు తెలిపారు. మాతృవియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టాలీవుడ్‌లో ఈగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

Hero Kiccha Sudeep,Mother Saroja Sanjeev,Bangalore,Eega movie,Deputy CM Pawan